FbTelugu

శిశు సంక్షేమ ఆఫీసులో కరోనా పంజా

అమరావతి: ఏపీ మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో 35 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ సోకింది. దీంతో ఉద్యోగులు విధులకు రావాలంటేనే హడలిపోతున్నారు.

భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడంతో గుంటూరులోని కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. శానిటైజేషన్ తరువాత విధులకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఒకరిద్దరికి తొలుత లక్షణాలు కన్పించగా పరీక్షలు చేయించారు. వారికి నిర్థారణ కావడంతో కార్యాలయంలో పనిచేసే 120 మందికి పరీక్షలు నిర్వహించారు. మరో 33 మందికి వ్యాధి నిర్థారణ అవ్వడంతో అధికారులు అప్రమత్తమయి కార్యాలయాన్నే మూసివేశారు. గుంటూరు జిల్లాలో మొదటి నుంచి కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది.

You might also like