FbTelugu

టీఎస్ పోలీసుల్లో క‌రోనా క‌ల్లోలం!

కరోనా వైర‌స్‌కు అదుపు చేసేందుకు పోలీసు, వైద్య విభాగాలు ప్రాణాల‌ను లెక్క‌చేయ‌క శ్ర‌మించాయి. ఆసుప‌త్రుల్లో డాక్ట‌ర్లు.. బ‌య‌ట ప్ర‌పంచంలో పోలీస్ ఇద్ద‌రూ స‌మాజం చుట్టూ క‌వ‌చంగా మారారు.

వైర‌స్ సోకుతుంద‌ని తెలిసి కూడా మ‌రీ ధైర్యం చేశారు. ఇంటికి దూరంగా రోజులు.. నెల‌ల త‌ర‌బ‌డి ఉంటూ ప్ర‌జాసంక్షేమ కోసం శ్ర‌మించారు.. శ్ర‌మిస్తూనే ఉన్నారు. అటువంటి వారిలో వైద్యుల‌కు మొద‌ట వైర‌స్ సోకింది. హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు వైద్యులు ప్ర‌స్తుతం వైద్యం పొందుతున్నారు. నెల్లూరు, క‌ర్నూలు త‌దిత‌ర చోట్ల కూడా వైద్యులు క‌ర‌నా తో పోరాడి మ‌ర‌ణించిన వారున్నారు. ఇప్పుడు పోలీసుల వంతు వ‌చ్చింది.

ట్రాఫిక్‌, శాంతిభ‌ద్ర‌త‌లు, లాక్‌డౌన్ నిబంధ‌న‌లు కొన‌సాగించేందుకు 24 గంట‌లు ప‌హారా కాశారు. ప‌నిపాట‌లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చిన వాహ‌నాల‌ను నిలిపివేశారు.. ఆ క్ర‌మంలో వాహ‌నంపై ప్ర‌యాణించిన వారిలో వైర‌స్ బాధితులుంటే.. ఆ వైర‌స్ పోలీసుల‌కూ చేరుతుంద‌ని తెలిసీ మ‌రీ తెగించారు. ఇప్పుడు దాని ఫ‌లితం వైర‌స్ భారీన ప‌డుతున్న పోలీసుల చూస్తే అర్ధ‌మ‌వుతుంది. తెలంగాణ పోలీసుల్లో ఒక కానిస్టేబుల్ క‌రోనాకు గురై చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. రాష్ట్రంలో ఇదే తొలి పోలీసు మ‌ర‌ణం కావ‌టంతో ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌రో డిటెక్టివ్ ఇన్‌స్పెక్ట‌ర్ కూడా వైర‌స్ భారీన‌ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ప‌ది మంది వ‌ర‌కూ కానిస్టేబుల్స్ అనుమానిత ల‌క్ష‌ణాల‌తో క్వారంటైన్‌లో ఉన్నారు.

మ‌రో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. లాక్‌డౌన్ ఆంక్ష‌లు స‌డ‌లించిన త‌రువాత పోలీసు విభాగంలో తొలిమ‌ర‌ణం న‌మోదు కావ‌టంతో అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. సీరియ‌స్‌గా తీసుకుని వైర‌స్‌ను అదుపు చేసేందుకు ప్ర‌భుత్వ‌శాఖ‌ల్లోని ఉద్యోగుల ఆరోగ్య‌ప‌ర‌మైన జాగ్ర‌త్త‌ల విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది.

You might also like