FbTelugu

బాధితుల్లో ఒక్కసారి మాత్రమే మూర్చ: కలెక్టర్

పశ్చిమగోదావరి: నెల్లూరు వింత రోగంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. వ్యాధికి సంబంధించిన పూర్తి వివరాలను తెలిపారు. జిల్లాలో మొత్తం 340 మంది అస్వస్థతకు గురైనారు. వారిలో 168 మంది డిశ్చార్జి అయినారు. ప్రస్తుతం 157 మంది చికిత్స పొందుతున్నారు. ఒకరు మృత్యువాత పడ్డారు. అస్వస్థతకు గురైన వారిలో పురుషులు 180 కాగా మహిళలు 160 మంది ఉన్నారు.

లక్షణాలు :
3 నుంచి 5 నిమిషాల పాటూ మూర్ఛ వస్తుంది. అయితే ఒక్కసారి మాత్రమే మూర్చ వస్తోంది. మళ్లీ రిపీట్‌ కాలేదు. బాధితుల్లో మతిమరుపు, ఆందోళన, వాంతులు, తలనొప్పి, వెన్నునొప్పి, నీరసం ఉన్నట్టుగా గుర్తించారు. ఇప్పటి వరకూ ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించలేదు. ప్రత్యేకించి పలానా వయసువారికి మాత్రమే అస్వస్థత వస్తుందనేది ఏమీ లేదు. పరీక్షల్లో దాదాపు అన్నీ సాధారణంగా ఉన్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.