FbTelugu

జాతీయ రహదారులుగా ఏపీలో 766 కి.మీ

అమరావతి: రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులు గా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా ఉన్న 11 మార్గాలకు జాతీయ రహదారుల హోదా కల్పించింది. మొత్తం 766.59 కిలోమీటర్ల పొడవైన రోడ్లు జాతీయ రహదారుల జాబితాలో చేర్చారు. ఇందులో ఐదింటికి వెంటనే నంబర్లూ కేటాయించగా, మిగిలిన ఆరు రహదారుల వివరాలు ఇస్తే వాటికి కూడా నంబర్లు ఇస్తామన్నారు. అయితే ఈ రహదారులకు సంబంధించింది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయించాల్సి ఉంటుంది. డీపీఆర్‌లు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన  తర్వాత వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించేందుకు వీలుంటుంది. కాగా 11 రహదారుల్లో.. 3 మినహా మిగిలినవన్నీ రాయలసీమ పరిధిలో ఉన్నాయి. ఈ రహదారుల్లో వాహన రద్దీ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు వరుసలు చేయలా, ఉన్నదాన్ని 10 మీటర్లకు విస్తరిస్తే సరిపోతుందా? అనేది ఇంజనీర్లు నిర్ణయించనున్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.