FbTelugu

వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకే..

Controversy-site-for-Ayodhya-Trust

మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే 5 ఎకరాలు

ఢిల్లీ: యావత్ దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య కేసు తుది తీర్పును సుప్రీం కోర్టు వెలువరించింది. వివాదాస్పద భూమి తమదేనంటూ షియా బోర్డు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. నిర్మోహి అకాడా రామజన్మభూమి అంటూ చేసిన పిటిషన్ ను కూడా త్రోసిపుచ్చింది. అయితే.. మత గ్రంథాల ఆధారంగా తీర్పు ఉండదనీ.. పురావస్తుశాఖ ఆధారాల ప్రకారం తీర్పు ఇవ్వనున్నట్టు తెలిపింది. కాగా రామమందిరం అక్కడ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. కాగా.. బాబ్రీ మసీదు కూడా ఖాళీ ప్రదేశంలో నిర్మించినట్టు ఆధారాలు లేవని తెలిపింది. మసీదును ముస్లింలు ఎప్పుడూ వదలలేదని కూడా తెలిపింది. రామ మందిరం ఉందనే హిందువుల నమ్మకాన్ని తప్పుట్టడానికి కూడా వీలు లేదని తెలిపింది. చివరగా ముస్లిములకు ప్రత్యామ్నాయ స్థలం ఉండాలని కూడా తెలిపింది. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని సూచించింది. వివాదాస్పద భూమిని రాంలాల్లా కే చెందుతుందని తీర్పునిచ్చింది. కాగా మూడు నెలల్లో అయోధ్య ట్రస్టును కేంద్రం ఏర్పాటు చేయాలని తెలిపింది.

You might also like