FbTelugu

చైనా కిట్ల నిషేధంపై వివాదం

ఢిల్లీ: కరోనా నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే చైనా కిట్లను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిషేధం విధించడంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే చైనాకు చెందిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో రిజల్ట్ కచ్చితంగా రావడం లేదని ఐసీఎంఆర్ చైనా కిట్లపై నిషేధం విధించింది. కాగా పూణే వైరాలజీ చైనా కిట్లకు అనుమతించిందని కానీ ఇప్పుడు నిషేధం విధించడమేంటని చైనా రాయబారి ఒకరు ప్రశ్నించారు.

కిట్ల రవాణా, స్టోరేజీలో జాగ్రత్తలు తీసుకోకుంటే పనితీరుపై ప్రభావం పడుతుందని అతడు తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా చైనా ఉత్పత్తులపై నాసీరకం ముద్రవేయడం తగదన్నారు. దీనిపై ఐసీఎంఆర్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.

You might also like