FbTelugu

జ‌గ‌న్ పాల‌న‌పై ప‌ట్టు సాధించ‌లేక‌పోతున్నారా!

Controllable-on-Jagans-rule-or-not

ఏపీ సీఎస్ సుబ్ర‌హ్మ‌ణ్యం బ‌దిలీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక‌ప్పుడు తండ్రి వైఎస్‌కు అనుంగుడు. టీడీపీ హ‌యాంలో ఇబ్బంది ప‌డిన సీనీయర్ ఐఏఎస్ అదికారి. త‌న‌యుడు జ‌గ‌న్ హ‌యాంలో మ‌ళ్లీ సీఎస్‌గా కీల‌కంగా మారాడు. పాల‌న‌లో త‌న మార్కు క‌నిపించేందుకు జ‌గ‌న్ ఏరికోరి తెచ్చుకున్న అధికారి. ఇది నాలుగు నెల‌ల క్రితం మాట‌. ఇప్పుడు.. అక‌స్మాత్తుగా బ‌దిలీపై వెళ్లారు. ఇదంతా పాల‌న‌క్ర‌మంలో భాగంగా జ‌రిగే బ‌దిలీ అయితే పెద్ద‌గా ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. సీఎంఓ కార్యాల‌యం సీఎస్ బ‌దిలీను స‌మ‌ర్థించుకుంటుంది. సీఎం జ‌గ‌న్ ఆదేశాల‌ను ధిక్క‌రించింనందుకు ఇది ప్ర‌తిఫ‌ల‌మంటూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టించింది. వాస్త‌వానికి జ‌గ‌న్‌పై ప్ర‌జ‌ల్లో అపార‌మైన న‌మ్మ‌కం ఉంద‌నేందుకు 151 అసెంబ్లీ సీట్లు నిద‌ర్శ‌నం. తొలినాళ్ల‌లో కాస్త త‌డ‌బాడు ప‌డినా.. మాన‌వ‌త్వం నేత‌గా జ‌గ‌న్ త‌న‌ను తాను నిరూపించుకునే ప్ర‌య‌త్నంచేశారు. అదే స‌మ‌యంలో టీడీపీపై ఎదురుదాడికి దిగాడు. అడ్డ‌గోలుగా క‌ర‌క‌ట్ట‌పై క‌ట్టిన భ‌వ‌నాలను కూలిపించారు. రాజ‌ధాని నిర్మాణం నిలిపివేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు రివ‌ర్స్ టెండ‌రింగ్‌తో త‌న క‌క్ష ఏ స్థాయిలో ఉంద‌నేది తేల్చిచెప్పారు. ఇదంతా జ‌గ‌న్ తెలిసి తెలియ‌క చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లూ లేక‌పోలేదు. ఇవ‌న్నీ జ‌గ‌న్ పాల‌న అనుభ‌వ లేమిని చూపుతున్నాయంటూ విప‌క్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. ఇసుక కొర‌త కృత్రిమం అంటూ విప‌క్షాలు అంటున్నా జ‌గ‌న్ మాత్రం కేవ‌లం న‌దుల‌కు వ‌ర‌ద‌లు రావ‌టం వ‌ల్ల త‌లెత్తిన స‌మ‌స్య అంటూ స‌మ‌ర్ధించుకుంటున్నారు.

కంపెనీలు ఏపీ నుంచి బ‌య‌ట‌కు వెళ్తుంటే ఇదంతా కుట్ర‌గా చెబుతున్నారు. 3 వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేసిన జ‌గ‌న్ నిజంగానే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప‌ట్టు సాధించారు. వాటిని ఎలా ప‌రిష్క‌రించాల‌నే స్ప‌ష్ట‌మైన ఆలోచ‌న‌తో ఉన్నారు. ఇది ఎవ‌రు కాద‌న్నా.. ఔన‌నే నిజం. కానీ అక్క‌డే ఐఏఎస్ అధికారులు జ‌గ‌న్‌ను చుల‌క‌న‌గా చూస్తున్నారు. ఆయ‌నిచ్చిన స్వేచ్ఛ‌ను దుర్వినియోగం చేస్తున్నార‌నేది వైసీపీ శ్రేణుల అభిప్రాయం. కానీ మాజీ ఐఏఎస్‌లు మాత్రం.. కేవ‌లం సుబ్ర‌హ్మ‌ణ్యం బ‌దిలీ వెనుక.. ఆయ‌న అన్య‌మ‌త‌స్తుల ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరు జ‌గ‌న్‌కు కోపం తెప్పించిందంటున్నారు. సీఎం తాను సూచించిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వాల‌ని చెప్పినా సీఎస్ విచ‌క్ష‌ణ‌తో వ్యవ‌హ‌రించ‌ట‌మే ఆయ‌న బ‌దిలీకు అస‌లు కార‌ణ‌మంటున్నారు. ఏమైనా సీఎస్ బ‌దిలీ సీఎం పాల‌న అనుభ‌వలేమి… స్ప‌ష్ట‌త‌లేని వైఖ‌రికి నిద‌ర్శ‌న‌మంటూ టీడీపీ ఎద్దేవా చేస్తుంది.

You might also like