న్యూఢిల్లీ: దేశంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, డిమాండ్ ను బట్టి డబ్బులు గుంజుతున్న క్యాబ్ లను నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మోటార్ వాహనాల పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
క్యాబ్ నిర్వహణ సంస్థలను చట్టం పరిధిలోకి తెస్తున్నది. ఫలితంగా క్యాబ్ సేవలు ఇప్పుడున్న ధరల కన్నా తక్కువ ఛార్జీలకే లభించనున్నాయి. ఓలా, ఉబెర్ వంటి క్యాబ్ లను కేంద్రం చెక్ పెట్టింది. డిమాండ్ ఉన్న సమయంలో 1.5 రెట్లు అధికంగా వసూలు చేసే ఛార్జీలకు కోత పెట్టింది. నిత్యం అందించే డిస్కౌంట్ బేస్ ఛార్జీల్లో 50 శాతానికి పరిమితం చేసింది.
సరైన కారణంగా ఎవరైనా బుకింగ్ ను రద్దు చేస్దే ఇద్దరికి 10 శాతం అపరాధ రుసుం, అది కూడా రూ.100 మించకూడదు. ప్రతి బుకింగ్ ద్వారా సమకూరే ఆదాయంలో 80 శాతం డ్రైవర్ కే చెందాలి. డ్రైవర్ కు రూ.5 లక్షల ఆరోగ్య బీమాతో పాటు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించాలి. ఏ ఒక్క డ్రైవర్ కూడా 12 గంటలు మించి పనిచేయకూడదు.