FbTelugu

ఇక అందుబాటులోకి నిరంతర ఆర్టీజీఎస్ సేవలు

హైదరాబాద్: ఇక నుంచి నిరంతర ఆర్టీజీఎస్ (RTGS-రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌/అధిక విలువ లావాదేవీలు) సేవలు అందుబాటులోకి రానున్నాయి. భారీ మొత్తంలో నగదు బదిలీకి ఉపయోగించే ఈ సేవలు గత అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటి వరకు ఆర్టీజీఎస్ సేవలు బ్యాంకు పని దినాల్లో ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకూ మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇకపై ఈ సేవలు నిరంతరం అందుబాటులో ఉండనున్నాయి. దీంతో ప్రపంచంలో నిరంతర ఆర్‌టీజీఎస్‌ సేవలందిస్తున్న కంపెనీల్లో భారత్‌ ఒకటిగా మారింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.