FbTelugu

కాల్వలోకి దూసుకెళ్లిన కార్ల కంటైనర్

Container-of-car-crashed-into-the-canal

తూర్పుగోదావరి: కార్లను తీసుకెళుతున్న ఓ భారీ కంటైనర్ కల్వలోకి దూసుకెళ్లిన ఘటన జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం గౌతమి బ్రిడ్జి సమీపంలో సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై నుండి ఒడిశాకు హోండా కార్ల లోడుతో వెళుతున్న ఓ భారీ కంటైనర్ అదుపుతప్పి తూర్పు డెల్టా ప్రధాన కాలువలోకి దూసుకుపోయింది. అయితే కంటైనర్ క్యాబిన్ కాలువలో పూర్తిగా మునిగి పోవటంతో ఎంతమంది ఉన్నారనేది తెలియవలసి ఉందని. కాగా రావులపాలెం నుండి క్రేన్లను తీసుకొచ్చినా కంటైనర్ భారీగా ఉండటంతో ప్రయోజనం లేకపోవడంతో ఓఎన్ జీసీ అధికారులతో చర్చలు జరిపి భారీ క్రేన్లను రప్పించేందుకు సిఐ మంగాదేవి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like