FbTelugu

కంటెయినర్ దహనం… ఇద్దరు మృతి

రంగారెడ్డి: ఔటర్ రింగు రోడ్డు పై భారీ కంటెయినర్ లో చెలరేగిన మంటలు మంటల్లో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. రెండు ప్రాంణాలతో పాటు కంటెయినర్ కూడా అగ్నికి అహుతి అయింది.

ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రొయ్యల లోడుతో వస్తున్న భారీ ఏసి కంటెయినర్ హిమాయత్ సాగర్ర్ వద్ద కు రాగానే మరో లారీని డీకొట్టింది. దీంతో భారీ కంటెనర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో సూరజ్, మూర్తునుజన్ అనే డ్రైవర్, క్లీనర్ సజీవ ధహనం అయ్యారు. మృతులు ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పొలిసులు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పూర్తిగా దహనం అయ్యింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.