FbTelugu

ఏపీలో 48 గంటల్లో ఇంటి నిర్మాణం పూర్తి

రాజమహేంద్రవరం: రాజమండ్రి రూరల్ జేగురుపాడులో 320 చదరపు గజాల్లో ఆధునిక సాంకేతిక విధానంతో మోడల్ హౌస్ ను నిర్మించారు. ఈ భవనాన్ని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ప్రారంభించారు.

సోలార్ రూప్ టెక్నాలజీ, వెర్టికల్ గార్డెనింగ్ తో రూపొందించి మోడల్ హౌస్ ను 48 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. రాష్ట్ర హౌసింగ్ చరిత్రలో మొదటిసారిగా ఈ మోడల్ హౌస్ నిర్మాణం జరిగిందని మార్గాని భరత్ తెలిపారు. ఇది విజయవంతం అయితే పేదలకు తక్కువ ఖర్చుతో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అందచేయవచ్చన్నారు. ఈ ఇంటి నిర్మాణం కోసం రూ.3.5 లక్షలు మాత్రమే వెచ్చించినట్లు ఆయన తెలిపారు.

You might also like