FbTelugu

ప్రపంచం అబ్బురపడేలా సచివాలయం: మంత్రి ప్రశాంత్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ అలోచనలకు అనుగుణంగా ప్రపంచం అబ్బురపడేలా నూతన సెక్రటేరియట్ భవనం నిర్మాణం ఉంటుందని ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన సెక్రటేరియట్ పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల్లో పురోగతి పరిశీలించారు. అధికారులను రోజువారీ వర్క్ చార్ట్ అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ ప్రాంగణం అంతా మంత్రి వేముల అధికారులతో కలిసి కలియతిరుగుతూ పలు సూచనలు చేశారు. ఆర్ అండ్ బి శాఖ పర్యవేక్షణలో వర్క్ ఏజన్సీ అయిన షాపూర్ పల్లోంజి ఆధ్వర్యంలో నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.
ఆవరణలోనే 2500 మంది నిర్మాణ కార్మికులు ఉండేందుకు అత్యధునాతన సౌకర్యాలతో వర్కర్స్ కాలనీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. నిర్మాణ ప్రాంతంలోనే రెడ్ మిక్స్ కాంక్రీట్ యూనిట్(బ్యాచింగ్ ప్లాంట్) ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడే రోజుకు 300 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ తయారీ అవుతుందన్నారు. ఐఐటి నిపుణుల వెట్టింగ్ లో భూకంపాలను తట్టుకునే విధంగా ఫుట్టింగ్ లు ఏర్పాటు చేశారన్నారు. ఒక్క ఫుట్టింగ్ లో 300 బస్తాల సిమెంట్ అంటే 40 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్,4 టన్నుల స్టీట్ పడుతుందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.

ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే ఎంత సిమెంట్, కాంక్రీట్, స్టీల్ పడుతుందో.. సెక్రటేరియట్ ఒక్క ఫుట్టింగ్ కే అంత పడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నాణ్యతలో ఎక్కడా రాజీ లేకుండా పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.