FbTelugu

మూడు పెళ్లిళ్ల కానిస్టేబుల్ అరెస్టు

హైదరాబాద్: మూడు పెళ్లిళ్లు చేసుకున్న సీఆర్పీఎప్ కానిస్టేబుల్ ఎడ్ల శంకరయ్య (39)కటకటాల పాలయ్యాడు. భార్యను వేధింపులకు గురి చేస్తూ, గుట్టుచప్పుడు కాకుండా మరో పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్ ను అరెస్టు చేసినట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సహారా ఎస్టేట్ లోని గందార అపార్ట్ మెంట్ లో ఎడ్ల శంకరయ్య నివాసం ఉంటున్నాడు. 2011  సంవత్సరంలో ఒక మహిళను పెళ్లి చేసుకుని వదిలేశాడు. మళ్లీ 2016 లో శారద (38) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి 2017 లో ఒక పాప జన్మించింది. గత కొద్ది కాలంగా భార్య, భర్తల మధ్య తగవులు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో రెండో భార్యకు తెలియకుండా 2019లో తిరుపతిలో మంజులా రాణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. మంజులా సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ ను నిర్వహిస్తున్నది. మరో వివాహం చేసుకున్నాడని తెలియడంతో రెండో భార్య శారద వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

You might also like