వరంగల్ రూరల్: ఓ కానిస్టేబుల్ తన భార్యను హత్య చేసి అనంతరం రోడ్డుమీదకు వచ్చి హల్ చల్ చేశాడు. ఈ ఘటన జిల్లాలోని ఖిలావరంగల్ మండలం, తిమ్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అయూబ్ ఖాన్(40) అనే వ్యక్తి రఘునాథపల్లి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
కాగా.. నిన్న రోడ్లపై కత్తి పట్టుకుని హల్చల్ చేస్తుండడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అతని భార్య తస్లీమా సుల్తానా అతన్ని విడిపించి ఇంటికి తీసుకెళ్లింది. ఏమైందో తెలియదుగాని తస్లీమాను హత్యచేసి మళ్లీ రోడ్డపైకి వచ్చి అయూబ్ హల్ చల్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.