హైదరాబాద్: పోలీసు ఉద్యోగి కదా అని లిఫ్ట్ ఇచ్చిన ఒక మహిళకు వేధింపులు తప్పలేదు. మహిళ ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కానిస్టేబుల్ ను అరెస్టు చేశారు.
ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అరెస్టు చేసినట్లు ప్రకటించారు. శ్రీనగర్ కాలనీ రోడ్డుపై కారులో వెళ్తున్న మహిళని లిఫ్ట్ కావాలని కానిస్టేబుల్ వీరబాబు అడిగాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ దాకా డ్రాప్ చేయాలని రిక్వెస్ట్ చేయగా ఆమె అంగీకరించింది. కారు ఎక్కించున్న తరువాత ఆమెతో మాటలు కలిపి మొబైల్ నెంబర్ తీసుకుని సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద దిగిపోయాడు.
మరుసటి రోజు నుంచి మహిళకు ఫోన్లు చేసి మాట్లాడ్డం, వాట్స్ అప్ లో మెస్సేజీలు చేసి వేధింపులు మొదలు పెట్టాడు. దీన్ని భరించలేని మహిళ బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్ని పోలీసులు విచారణ జరిపి, కానిస్టేబుల్ వీరబాబు పై ఐపీసీ 354,509 సెక్టన్ల కింద కేసు నమోదు చేశారు. టీఎస్ పీపీ 12వ బెటాలియన్ కానిస్టేబుల్ వీరబాబు ప్రస్తుతం పంజాగుట్ట పోలిస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు.