FbTelugu

చంద్రబాబు పర్యటన అడ్డుకునే కుట్ర: అచ్చెన్నాయుడు

అమరావతి: సోమవారం విశాఖపట్నం పర్యటనకు చంద్రబాబు నాయుడుకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి, విమాన సర్వీసులను నిలిపేయడంలో వైసీపీ ప్రభుత్వ కుట్ర ఉందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు.

రేపు ఒక్కరోజే ఏపికి విమాన సర్వీసుల బంద్ చేయడం వైసీపీ కుట్రలో భాగమేనన్నారు. రేపు ఒక్కరోజే విశాఖ, విజయవాడ ఎయిర్ పోర్టుల మూత వేయడం, మళ్లీ మంగళవారం సర్వీసులు ఉన్నాయని చెప్పడం దీనికి బలం చేకూరుస్తోందన్నారు. చంద్రబాబు షెడ్యూల్ ప్రకటించాకే ఏపీ కి విమాన సర్వీసుల బంద్ చేశారని, ఏపీ ఎయిర్ పోర్టుల మూతకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ దీనికి ప్రత్యక్ష రుజువు అన్నారు.

ఏపీ ప్రభుత్వ అభ్యర్దన మేరకే సర్వీసులు రద్దు చేశామని హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేశారు. 26వ తేదీకే ఏపీ కి పరిమిత సర్వీసులని కేంద్రమంత్రి చెప్పారన్నారు. చెన్నైకి గరిష్టంగా 25 సర్వీసులు నడుపుతున్నట్లు, దేశంలో ఇతర ఎయిర్ పోర్టుల తరహాలోనే తమిళనాడులో ఇతర ఎయిర్ పోర్టులకు సర్వీసులు ఉంటాయని హర్దీప్ సింగ్ పురి ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ రోజు విశాఖ వెళ్లకుండా ఆపగలిగినా విశాఖ వాసుల మనుసులలో నుంచి చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని చెరిపేయడం వైసీపీ నాయకులకు అసాధ్యం అనేది గుర్తుంచుకోవాలి. అతి త్వరలోనే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజి  బాధిత కుటుంబాలను చంద్రబాబు పరామర్శిస్తారని అచ్చెన్నాయుడు తెలిపారు.

రోడ్డు మార్గంలో విజయవాడకు…

విమాన సర్వీసులు రద్దు కావడంతో చంద్రబాబు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లనున్నారు. హైదరాబాద్ లో ఉదయం బయలుదేరి మధ్యాహ్నం విజయవాడ శివారు ఉండవల్లి చేరుకోనున్నారు.

You might also like