FbTelugu

నిలకడగా బాలు ఆరోగ్యం: వైద్యులు

బాలు భార్య సావిత్రికి పాజిటివ్
చెన్నై: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగాఉందని ఎంజీఎం హెల్త్ కేర్ సెంటర్ ప్రకటించింది. కరోనా పాజిటివ్ లక్షణాలతో ఈ నెల 5వ తేదీన ఆయన ఎంజీఎం లో చేరారు.

ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో గురువారం రాత్రి ఐసీయూకు తరలించామని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. నిపుణులైన వైద్య బృందం ఆయనని పర్యవేక్షిస్తున్నారని శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని, వదంతులు నమ్మొద్దని ఆయన కుమారుడు చరణ్ ప్రకటించారు. తన తల్లి సావిత్రికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్థారణ అయ్యందని, చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించామని తెలిపారు.

You might also like