FbTelugu

రంగంలోకి ప్రియాంక… మెత్తబడిన పైలట్

ఢిల్లీ: రాజస్థాన్ రాజకీయాలు గంటగంటకూ మారుతూ కొత్తరూపాన్ని సంతరించుకుంటున్నాయి. రాజకీయ విశ్లేషకులు అంచనాలు సైతం తల్లకిందులవుతున్నాయి.
మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కుప్పకూలడం, తాజాగా రాజస్థాన్ లో అదే పరిస్థితి పునరావృతం కావడంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా వాద్రా రంగంలోకి దిగింది. ప్రియాంకా సన్నిహితులు జరిపిన చర్చలతో సచిన్ పైలట్ మెత్తబడ్డారు. సీఎం అశోక్ గెహ్లట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య రాజీ ఫార్మూలాను తెచ్చారు.

పార్టీ అధ్యక్షుడిగా తనను కొనసాగించడంతో పాటు తన వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇవ్వలని షరతు విధించారు. ఆర్థిక, హోం శాఖలను తమ వర్గానికి కట్టబెట్టాలని పార్టీ పెద్దల ముందు పెట్టారు. సచిన్ డిమాండ్లను సీఎం అశోక్ దృష్టికి తీసుకువెళ్లారు.
పైలట్ తో చర్చలు జరుగుతున్నాయని, ఆయన పార్టీని వీడడం లేదని పార్టీ ప్రతిని రణదీప్ సుర్జేవాలా ప్రకటించారు. రాజస్థాన్ అసెంబ్లీలో పార్టీల బలాబలాలు ఈ విధంగా ఉన్నారు. 200 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ కు 107 మంది, 13 మంది ఇండిపెండెంట్ల మద్దతు ఉంది. బీజేపీకి 72 మంది సభ్యలతో రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి చెందిన ముగ్గురు మద్దతిస్తున్నారు.

You might also like