FbTelugu

అమితాబ్, అక్షయ్ లకు కాంగ్రెస్ ఆల్టిమేటం

ముంబయి: కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ ధరలు పెరిగితే ట్వీట్లు చేసిన బాలీవుడ్ ప్రముఖ హీరోలు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లు ఇప్పుడు నోరు మెదపడం లేదని మహారాష్ట్ర కాంగ్రెస్ విమర్శించింది.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఒకలా, బీజేపీ ప్రభుత్వం ఉంటే మరోలా ప్రవర్తిస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నానా పటోలే విరుచుకుపడ్డారు.

ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆయిల్ ధరలపై ఇద్దరు నటులు తమ వైఖరి స్పష్టం చేయాలని లేదంటే వారి సినిమాలను మహారాష్ట్రలో అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో పెట్రోల్ ధరలు పెంచితే ట్వీట్ల మీద ట్వీట్లు చేశారన్నారు. ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా తమ వైఖరిని స్పష్టం చేయాలని లేకుంటే వారి సినిమాల షూటింగ్ లను కూడా అడ్డుకుంటామని నానా పటోలే స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.