FbTelugu

మమతకు జైకొట్టిన కాంగ్రెస్ కంచుకోటలు

కోలకతా: పశ్చిమ బెంగాల్ లో కొన్ని దశాబ్ధాల నుంచి రెండు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన పట్టు ఉంది. ఆ జిల్లాల్లోని ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కడుతూ వస్తున్నారు.
మారిన పరిస్థితుల నేపథ్యంలో వారంతా సాంప్రదాయిక పార్టీకి గుడ్ బై చెప్పి సిఎం మమతా బెనర్జీకి జై కొట్టారు. ముస్లిం ఆధిక్య జిల్లాలైన మలాదా, ముర్షీదాబాద్ లో టిఎంసి అభ్యర్థులు అనూహ్య విజయం సాధించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మాల్దాలో 12 సీట్లలో, ముర్షీదాబాద్ లో 18 స్థానాల్లో గెలుపొందింది. ఈ రెండు జిల్లాల్లో 34 సీట్లు ఉండగా, 30 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. అయితే ముర్షీదాబాద్ లో మాత్రం 4 సీట్లలో టిఎంసి గెలుపొందింది. 2011లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినప్పటికీ 2021 నాటికి పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ పార్టీ దేశంలో గెలిచే అవకాశాలు లేకపోవడం, సిఎఎ, ఎన్నార్సీని మమతా బెనర్జీ వ్యతిరేకించడంతో ముస్లిం ఓటర్లు టిఎంసిని గెలిపించాలని తీర్మానించారు.

2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, టిఎంసీ, బిజెపి త్రిముఖ పోరులో బిజెపి లాభపడిందనేది ముస్లిం వర్గాలు గమనించాయి. అందుకే ఈసారి కాంగ్రెస్ కు కాకుండా టిఎంసికి గంపగుత్తగా ఓటేశారు. రెండు జిల్లాల్లోని 32 సీట్లలో 24 సీట్లలో టిఎంసి అభ్యర్థులు విజయం సాధించారు. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు చనిపోయవడం శంషేర్ గంజ్, జంగీపూర్ లో పోలింగ్ వాయిదా పడింది. బిజెపి కూడా ఈ రెండు జిల్లాల్లో 8సీట్లలో గెలుపొంది సత్తా నిరూపించుకుంది. ఈ రెండు పార్టీల భీకరపోరులో కాంగ్రెస్ అభ్యర్థులు ఘోరంగా ఓటమిపాలయ్యారు. టిఎంసి గెలవడానికి ప్రధాన కారణం ఉంది. మల్దాలో ముస్లింల జనాభా 51శాతం, ముర్షీదాబాద్ లో 66 శాతం ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.