FbTelugu

పీసీసీ బీసీలకే ఇవ్వాలి: వీహెచ్

హైదరాబాద్: గత కొంత కాలంగా తెలంగాణలో కాంగ్రెస్ తీవ్ర పరాభవాలు ఎదుర్కొంటున్న తరుణంలో.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. దీంతో ప్రస్తుతం టీపీసీసీ పదవికోసం భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ పదవి గతంలో అగ్రకులాలకు ఇచ్చారు కాబట్టి ఈ సారి అ పదవిని బీసీలకు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ ను గెలిపించడంతో ప్రస్తుత అగ్రనేతలు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఈ సారి పీసీసీ రేసులో తాను కూడా ఉన్నానంటూ పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.