FbTelugu

44 రోజులౌతున్నా కేంద్రానికి స్ఫృహ లేదా?: సోనియా

న్యూఢిల్లీ: దేశంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 44 రోజులకు చేరినా ప్రభుత్వానికి స్ఫృహ లేదా అంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా.. దేశంలో మాత్రం పెట్రోలు ధరలు పెంచారని అన్నారు. ఈ విధంగా ప్రభుత్వం ప్రజల జేబుల నుంచి రూ.19 లక్షల కోట్లు వసూలు చేసిందని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.