FbTelugu

దేవరయాంజాల్ లో కెసిఆర్ కుటుంబానికి భూములు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: దేవర యాంజాల్ సీతారామస్వామి ఆలయ భూముల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు, బంధువులకు భూములు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపి ఎ.రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిషేదిత జాబితాలో ఉన్న 437 సర్వేలో మున్సిపల్ మంత్రి కెటిఆర్, నమస్తే తెలంగాణ సిఎండి డి.దామోదర్ రావు కు భూములున్నాయన్నారు. నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రింటింగ్ ప్రెస్ అక్కడే ఉందని, సేల్ డీడ్ కాపీలను బయటపెడుతున్నానని అన్నారు. కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి సర్వే నెం. 658 లో 7 ఎకరాలను ఆక్రమించి ఫైవ్ స్టార్ స్థాయిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారన్నారు. వీరే కాకుండా టీఆర్ఎస్ స్థానిక ప్రజా ప్రతినిధులకు అక్కడ భూములున్నాయన్నారు. 2015 లో కెటిఆర్ 11 లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశారన్నారు.

కోట్ల విలువ భూములను అంత తక్కువ ధరకు ఎలా కొనుగోలు చేశారో సమాధానం చెప్పాలన్నారు. ధరణి పోర్టల్ లో దేవరాయాంజాల్ భూముల ఎందుకు మాయం అయ్యాయనేది మిస్టరీగా మారిందన్నారు. 1531 ఎకరాల భూములకు సబంధించి సర్వే నెంబర్ల వారిగా దేవదాయ శాఖ భూముల వివరాలను ధరణిలో ఎందుకు పెట్టలేదన్నారు. 9 జిల్లాల వివరాలు ఉంచి..రంగారెడ్డి జిల్లా దేవాదాయ భూములు ఎందుకు అన్ లైన్లో దాచారన్నారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెవిన్యూ రికార్డుల్లో జరిగిన మార్పులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. 95 సంవత్సరాలకు దేవరయాంజాల్ దేవాలయ భూముల వివరాలను బయట పెట్టాలన్నారు. స్థానిక ఎంపీగా నేను అడిగినా రికార్డులు, జరిగిన లావాదేవిల చిట్టాను ఇవ్వడం లేదని ఆయన తెలిపారు. మీ బండారం బయటపడుతదనే ప్రజలకు చెప్పడం లేదన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ కు నచ్చితే నజరానా..నచ్చకపోతే జుర్మానా విధిస్తారన్నారు. దేవరయాంజాల్ దేవాలయ భూముల పేరుతో రాజకీయ కక్షకు దిగుతున్నారు. ఈటలను తొలగించిన విధంగానే కబ్జా మంత్రులు కెటిఆర్, మల్లారెడ్డిలను శాఖల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగానికి దిగే ప్రమాదం ఉంది..అందుకే తక్షణం తొలగించాలన్నారు. ప్రభుత్వానికి సంబంధం లేని దేవదాయ భూములను తనఖా పెట్టి నమస్తే తెలంగాణ వందల కోట్ల రుణాలు తెచ్చుకుందన్నారు. రాష్ట్ర విచారణలో నిజాయితీ లేదు..అనుకూలంగా చేసుకుంటున్నారు. ఆఖరికి బ్యాంకులను తప్పు దారి పట్టించారు, అందుకే సీబీఐ విచారణ జరపాలన్నారు. ఈ భూ దందాపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు సబిఐ విచారణ జరపాలని ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.