FbTelugu

ఆరోగ్య శ్రీ పై అంబేద్కర్ కు వినతిపత్రం

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క కరోనా రోగుల ప్రాణాలు కాపాడేందుకు నిరసన చేపట్టారు. కరోనా ను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ ట్యాంక్ బండ్ వద్ద రాజ్యాంగ నిర్మాత బిఆర్.అంబేద్కర్ కు వినతి పత్రం ఇచ్చారు.

సిఎం కెసిఆర్ సచివాలయానికి రాకుండా, ప్రగతి భవన్ లో అందుబాటు లో లేకపోవడంతో తన వినతి పత్రాన్ని అంబేద్కర్ కు ఇవ్వాలని సీతక్క నిర్ణయించింది. కరోనా రోగులు పడుతున్న ఇబ్బందులు ఎన్ని ప్రకటనలు చేసినా, నిరసనలు వ్యక్తం చేసినా సిఎం కెసిఆర్ పట్టించుకోవడం లేదన్నారు. పొరుగున ఉన్న ఏపిలో సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చారని, ఆయనను చూసి బుద్ది తెచ్చుకోవాలని సీతక్క హితవు పలికింది. రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఏ హాస్పిటల్ కు వెళ్లినా వారితోనే నిండిపోతున్నాయని అన్నారు. ఏ హాస్పిటల్ లో కూడా రోగులకు మంచాలు దొరకడం లేదని, ప్రభుత్వ హాస్పిటళ్లలో నాణ్యమైన వైద్యం లభించడం లేదని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.