FbTelugu

ఫేస్ బుక్ దాసోహం పై కాంగ్రెస్ లేఖ

ఢిల్లీ: ద్వేషపూరిత వ్యాఖ్యల నియంత్రణ విధానానికి విరుద్ధంగా భారత్ లో బీజేపీకి ఫేస్ బుక్ దాసోహం అయ్యిందని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. భారత్ లోని ఫేస్ బుక్ ప్రతినిధుల పక్షపాత వైఖరిపై నిర్ణీత కాలపరిమితితో విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ డిమాం చేసింది.

దేశంలో హింసను ప్రేరేపించే విధంగా విభజన వాద వార్తలను అనుమతించేందుకు ఫేస్ బుక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంకిదాస్ బీజేపీ చేతిలో పావుగా మారిందని ఆరోపించింది. కాంగ్రెస్ వ్యవస్థాపకులు, నాయకులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నెలకొల్పిన విలువలు, హక్కులు పాతరేయడంతో ఫేస్ బుక్ భాగస్వామిగా మారిందని కాంగ్రెస్ పేర్కొంది.
అనేక పోరాటాలు చేసి సాధించుకున్న ప్రజాస్వామ్యాన్ని పక్షపాతం, నకిలీ వార్తలు, వీడియోల ద్వారా దెబ్బతీసేందుకు అనుమతించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. తాము లేవనెత్తిన అంశాలపై చర్యలు తీసుకునేందుకు సమయం ఉందని, మించిపోలేదని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేసీ.వేణుగోపాల్ ఫేస్ బుక్ అధినేత జూకర్ బర్గ్ కు లేఖ రాశారు. రెండు రోజుల క్రితం ఫేస్ బుక్ దాసోహంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక పరిశోధనాత్మక కథనం రాసిన విషయం తెలిసిందే.

You might also like