న్యూఢిల్లీ: ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్నా, చెల్లెల్లు నానా పాట్లు పడుతున్నారు. త్వరలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక సుడిగాలి పర్యటన చేస్తున్నారు.
రాహుల్ తమిళనాడు రాష్ట్రంలో పర్యటిస్తుండగా, ప్రియాంక అస్సాంలో పర్యటిస్తున్నారు. కన్యాకుమారిలోని ములగుమూడుబన్ ప్రాంతంలోని సెయిం జోసఫ్ పాఠశాల విద్యార్థులతో ఇవాళ రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఒక విద్యార్థిని తనతో పాటు పుషప్స్ చేయాలని సవాల్ చేయగా, రాహుల్ అందుకు అంగీకరించాడు. విద్యార్థిని కంటే వేగంగా రాహుల్ పుషప్స్ తీసి అక్కడున్న విద్యార్థులను ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ను రాహుల్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
అస్సాం రాష్ట్రంలో ప్రియాంకా వాద్రా పర్యటిస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో పలు సభల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు. లఖింపూర్ లో తేయాకు తోటల్లో పనిచేసే ఆదీవాసి మహిళలతో కలిసి ఝుమర్ నృత్యం చేశారు. ఈ వీడియోను కూడా ప్రియాంక సోషల్ మీడియలో పోస్టు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో గెలవకపోయినా మెజారిటీ స్థానాలు సాధించుకుని పరువు నిలుపుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.