FbTelugu

కాంగ్రెస్ నేతలు అభివృద్ధి నిరోధకులు: జగదీష్ రెడ్డి

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన వ్యవసాయ విధానాన్ని విపక్షాలు వ్యతిరేకించడం సరికాదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అభివృద్ధి నిరోధకాలుగా మారుతున్నారు.

వారి తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ధరల నిర్ణయంలో రైతుల భాగస్వామ్యానికే ఈ నూతన వ్యవసాయ విధానమని అన్నారు. ఈ విధానంలో తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శమౌతారని అన్నారు. రాష్ట్రంలో ప్రతి రైతుకు రైతుబందు అందిస్తామని అన్నారు.

You might also like