FbTelugu

కెసిఆర్.. స్టాలిన్ ను చూసి నేర్చుకో: విహెచ్ హితవు

హైదరాబాద్: తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకె.స్టాలిన్ ను చూసి సిఎం కెసిఆర్ బుద్ది తెచ్చుకోవాలని కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు హితవు పలికారు. ముఖ్యమంత్రి కాగానే ఒక్కో కుటుంబానికి రూ.4వేలు నగదు సాయం ఫైలుపై సంతకం చేశారన్నారు.

రాష్ట్రంలో కరోనా తో అల్లాడుతున్న కుటుంబాలకు రూ.10వేల చొప్పున కెసిఆర్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రంలో సాయం చేసేందుకు డబ్బులు పుష్కలంగా ఉన్నాయని హన్మంతరావు తెలిపారు. ఇవాళ హన్మంతరావు మీడియాతో మాట్లాడుతూ, కెసిఆర్ కు కరోనా వైరస్ కంటే ఎక్కువగా అవినీతిపై వెంటపడుతున్నారన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఒక్కరే అవినీతికి పాల్పడలేదని, చాలా మంది ఉన్నారన్నారు. వారందరిపై విచారణ చేసి నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. కరోనాతో ప్రజలు అల్లాడుతున్నారని, అసైన్డు భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కార్మిక శాఖ మంత్రి సి.మల్లారెడ్డి మేడ్చల్ జిల్లాలో చెరువులో మెడికల్ కాలేజీ నిర్మాణం చేశారని, ఎందుకు కూల్చివేయడం లేదని నిలదీశఆరు. చెరువులో కట్టారని యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని ప్రశ్నించారు. సిఎం కెసిఆర్ సచివాలయం, కాళేశ్వరం పై ఉన్న శ్రద్ధ పేద ప్రజల ప్రాణాలపై లేదని హన్మంతరావు విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.