FbTelugu

బాలీవుడ్ ఐటీ దాడులపై రాహుల్ మండిపాటు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్న బాలీవుడ్ నటీనటులు, దర్శకులు, నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు మద్దతిస్తున్న వారిపై బీజేపీ ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఈసారి రాహుల్ గాంధీ హిందీ పదాలను ఉపయోగిస్తూ బీజేపీని ఏకిపారేశారు. ఖిసియానీ బిల్లీ ఖంబానీచే (అత్తమీది కోపం దుత్తమీద తీయడం), ఉంగ్లీయోంపే నాచ్ నా (ఇష్టమున్నట్లు ఆడిస్తున్నారు), భిగీ బిల్లీ బనానా (భయపెట్టించడం) అన్న జాతీయాలను వాడడం ఇదే తొలిసారి. ఆదాయపన్ను శాఖ, ఈడీ, సీబీఐ లను ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు వాడుకుంటున్నారన్నారు. అనుకూలంగా ఉంటున్న మీడియా ముందు మోదీ మోకరిల్లుతూ, పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.

రైతులకు మద్దతిస్తున్న వారిపై మాత్రం ఐటీ దాడులకు దిగుతున్నారని అన్నారు. బుధవారం నాడు ముంబయి, పూణే లో బాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. సోదాలు నిర్వహించిన తరువాత నటీ తాప్సీ, దర్శకుడు కశ్యప్ లను ప్రశ్నించారు. వీరిద్దరూ రైతు ఉద్యమానికి సంపూర్ణ మద్ధతు ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.