FbTelugu

బీజేపీ గుప్పిట్లో ఫేస్ బుక్, వాట్సాప్: రాహుల్

ఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సప్, ఫేస్ బుక్ లను బీజేపీ-ఆర్ఎస్ఎస్ లు సంయుక్తంగా అదుపు చేస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.

కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రసంగాలు, నిరాధార వార్తలను బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆయినా వారిపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథానానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ లను రాహుల్ షేర్ చేశారు.
వాల్ స్ట్రీట్ జర్నల్ లో బీజేపీ, ఫేస్ బుక్ బంధంపై సంచలనాత్మక కథనం ప్రచురితమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, హిందూవాదానికి అనుకూలంగా ఫేస్ బుక్ పనిచేస్తున్నదని తెలిపింది. విద్వేష కథనాలపై ఇటీవలే అధినేత మార్క్ జూకర్ బర్గ్ ప్రత్యేకంగా ఉద్యోగులతో సమావేశమయ్యారు. రెచ్చగొట్టే, నిరాధార వార్తలపై జాగ్రత్తగా వ్యవహరించాలని ఉద్యోగులను సూచించారు. అయినా ఇండియాలో బీజేపీ నుంచి వస్తున్న విద్వేషపూరితమైన వార్తల విషయంలో ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ చెప్పుకొచ్చింది.

ఇదే విషయాన్ని రాహుల్ ప్రస్తావిస్తూ, ఫేస్ బుక్, వాట్సప్ ఫ్లాట్ ఫామ్ పై అదేపనిగా నిరాధార వార్తలు, నిందాపూర్వక ఆరోపణలు, ద్వేషాన్ని వ్యాప్తి చేసి ఓటర్లను మభ్యపెడుతున్నారనే విషయం అమెరికా మీడియా బయటపెట్టిందని ఆయన తెలిపారు.

You might also like