FbTelugu

 గంగా నది వెంట 2వేలకు పైగా శవాలు!

న్యూఢిల్లీ: గంగానది పిలుస్తోందని ఒకప్పుడు వ్యాఖ్యలు చేసిన నేతలే ఇప్పుడు నదిని విలపించేలా చేసతుననారంటూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
గంగా నదిలో కరోనా మృతదేహాలను ఖననం చేస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాందీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని రాహుల్ పరోక్ష విమర్శలు చేశారు. గంగా నదిలో శవాలు కొట్టుకుని రావడంతో ఆయన విమర్శించారు.

1140 కిలోమీటర్ల పొడవున ఉన్న నదీ తీర ప్రాంతంలో ఇప్పటి వరకు 2వేలకు పైగా శవాలను గుర్తించారని వచ్చిన వార్తను రాహుల్ తన ట్వీట్ కు అటాచ్ చేశారు. కొద్ది రోజులుగా ఉత్తరప్రదేశ్, బిహార్ లోని నదీ పరివాహక ప్రాంతాల్లో వందలాది శవాలు తేలుతూ కన్పించడంతో స్థానిక ప్రజలు భయకంపితులయ్యారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. స్మశాన వాటికలకు తీసుకువెళ్తే రెండు మూడు రోజుల పాటు వేచి ఉండాల్సి రావడంతో అంబూలెన్స్ లోనే నదీ వద్దకు తీసుకువెళ్లి పడేస్తున్నట్లు సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.