FbTelugu

విమానాలకు వేల కోట్లు… రైతులకు రిక్తహస్తం: ప్రియాంక

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ విలాసవంతమైన రెండు విమానాలను ఖరీదు చేసేందుకు రూ.16వేల కోట్లు వెచ్చించారని, అదే రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు మనసు రావడం లేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక వాద్రా ఆరోపించారు.

చంద్రాపూర్ లో కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రియాంక ప్రసంగించారు. ఒక్కో విమానానికి రూ.8వేల చొప్పున రెండు విమానాలను మోదీ ప్రభుత్వం ఖరీదు చేసిందని ఆమె ఆరోపించారు. మరో రూ.20వేల కోట్లు వెచ్చించి పార్లమెంటు భవనం నిర్మాణం చేస్తున్నారన్నారు. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్న మోదీ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ముందుకు రావడం లేదన్నారు. రైతు రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వం డబ్బులు లేవా అని ప్రియాంక ప్రశ్నించారు.
ప్రభుత్వం వద్ద డబ్బులు లేకుంటే విమానాలు ఎందుకు కొన్నారు, పార్లమెంటు ఎందుకు కడుతున్నారో సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.