FbTelugu

కాంగ్రెస్ నేత ఎమ్మెస్సార్ మృతి

హైదరాబాద్: మాజీ పిసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ రాజకీయ నాయకులు ఎం. సత్యనారాయణ రావు (88) సోమవారం అర్ధరాత్రి 2.45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎమ్మెస్సార్ హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతు మరణించారు.

ఈ రోజు మధ్యాహ్నం జూబ్లిహిల్స్ లోని మహా ప్రస్థానం స్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎమ్మెస్సార్ మృతి పట్ల టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ సిఎల్పి నేత జానారెడ్డి, ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు, జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్, తెలంగాణ మంత్రి ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి లు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భావంతుణ్ణి ప్రార్థించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.