FbTelugu

హెచ్.సి.ఏ నిబంధనలు ఖూనీ: అజారుద్దీన్

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) నిబంధనలను ఐదుగురు అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఖూనీ చేస్తున్నారని, అడ్డుకోవాలని చూస్తున్న తనపై బురద జల్లుతున్నారని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ ఆరోపించారు.
ఇవాళ ఆయన సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, హెచ్.సి.ఏ నోటీసులపై స్పందించారు. అపెక్స్ కౌన్సిల్ లో మొత్తం 9 మంది సభ్యులు ఉండగా, ఐదుగురు మాత్రమే సమావేశానికి రావడం లేదన్నారు.

జాన్ మనోజ్, నరేశ్ శర్మ, అనురాధ, విజయానంద్, అనురాధ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. వీళ్ల అవినీతికి తాను అడ్డుపడుతున్నాననే అక్కసుతో నాకు నోటీసులు పంపించారని అజారుద్దీన్ అన్నారు. హెచ్.సి.ఏ లో అవినీతిని అరికట్టేందుకు అంబుడ్స్ మెన్ ను నియమిస్తే ఈ ఐదుగురు తప్పుపడుతున్నారన్నారు. వాళ్ల తప్పుడు పనులు కప్పి పుచ్చుకునేందుకే ఈ నాటకం మొదలు పెట్టారని ఆయన ధ్వజమెత్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.