FbTelugu

పాజిటివ్ తో ఆత్మహత్య చేసుకున్న కాంగ్రెస్ నాయకుడు

కడప: కాంగ్రెస్‌ పార్టీ కడప జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగిరెడ్డి గంగిరెడ్డి(55) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇటీవల ఆయన కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది.
చికిత్స చేయించుకునేందుకు రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరులోని మదన్‌ ఆస్పత్రిలో చేరారు.

సోమవారం సాయంత్రం ఆయన ఆస్పత్రి నుంచి బయటికి వస్తుండగా, సెక్యూరిటీ సిబ్బంది ప్రశ్నించారు. కిందకు వెళ్లి వస్తానని చెప్పిన గంగిరెడ్డి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్లపల్లెలో రైల్వే ట్రాక్‌పై ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం పంపించారు.

You might also like