FbTelugu

ఐఎస్ఐతో మాట్లాడతారు… ప్రతిపక్షాలతో మాట్లాడరు!: ప్రియాంక

న్యూఢిల్లీ: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పాకిస్థాన్ లోని ఐఎస్ఐ తో మాట్లాడుతుంది కాని ప్రతిపక్షాలతో మాట్లాడేందుకు సమయం ఉండదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ దెప్పి పొడిచారు.
కరోనా మహమ్మారి విశ్వరూపంతో దేశం అతలాకుతలం అవుతుంటే కనీసం ప్రతిపక్ష నేతలతో సంప్రదింపులు జరపడం లేదని, అఖిల పక్ష సమావేశం నిర్వహించడం లేదని ఆమె విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దుబాయ్ లోని ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) తో తరచూ మాట్లాడుతోందన్నారు.

వారితో మాట్లాడినప్పుడు ప్రతిపక్షాలతో మాట్లాడలేరా అని ఆమె ప్రశ్నించారు. దేశం కోసం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వని ప్రతిపక్ష నేత ఉంటారని తాము భావించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోదీ గారడి మాటలు, పగటి వేషాలు మానుకోవాలని ఆమె కోరారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి పార్టీలకతీతంగా అందరూ మద్ధతు ఇస్తారని ప్రియాంక అన్నారు.
నేనే అనే అహంకారం, నువ్వా నేనా అనే ధోరణి ఎవరకి తగదని, ప్రజలకు మద్ధతుగా ప్రధాన మంత్రి మోదీ నిలబడాలన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్షాలు గళమెత్తకపోతే, ఇక ఎవరు మాట్లాడతారాని ఆమె ప్రశ్నించారు. మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధానిగా ఎంతో హుందాగా పని చేశారన్నారు. ఆయన ఇచ్చిన సలహాను మోదీ పాటించాలని ప్రియాంక హితవు పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.