FbTelugu

1981లోనే పేదలకు కాంగ్రెస్ భూములిచ్చింది: వీహెచ్

హైదరాబాద్: కీసర భూవివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కీసర మండలంలో 1981లోనే పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం భూములిచ్చిందని అన్నారు.

దున్నేవాడిదే భూమి అంటూ ఇందిరాగాంధీ భూసంస్కరణలు ప్రవేశపెట్టిందని అన్నారు. కోర్టులో భూ వివాదం నడుస్తోందని.. త్వరలోనే అసలు నిజాలు తెలుస్తాయని అన్నారు. భూవివాదంలో ఎవరున్నా వారందరిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

You might also like