FbTelugu

హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పై అయోమయం!

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ లాక్ డౌన్ పై ముందుకు వెళ్తే ఒక సమస్య. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మరో సమస్యలా పరిణమించింది. దీనిపై ఎటూ తేల్చుకోలేని సందిగ్ధస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

జూలై మొదటి వారం నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ విధించే యోచనలో ఉన్నామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌కు అందరినీ సిద్ధం చేయాలంటూ ఉన్నతస్థాయి సమావేశంలో ఇటీవల కేసీఆర్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ విధించడంపై పలు వర్గాల నుంచి వస్తున్న విన్నపాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేక పోతుంది.

లాక్‌డౌన్‌ వల్ల కరోనా కట్టడి సాధ్యంకాకపోవచ్చని పారిశ్రామిక, వాణిజ్య, ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుందనే వాదనలు తెరమీదకు వచ్చాయి. అయితే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠినంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. మళ్లీ హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధిస్తారన్న ప్రచారంతో వేలాది మంది మూటాముళ్లే సర్ధుకుని సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.