FbTelugu

చిన్నారి కరోనా టెస్ట్ రిపోర్టుల్లో గందరగోళం

కర్నూలు: పదకొండు నెలల చిన్నారికి నిర్వహించిన కరోనా టెస్టు రిపోర్టుల్లో గందరగోళం చోటుచేసుకుంది. చిన్నారికి కరోనా నెగెటీవ్ వచ్చిందని ఇంటికి కూడా పంపేశారు. ఈ ఘటన జిల్లాలోని ఆస్పరి మండలం, జోహరాపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన 11 నెలల చిన్నారికి సంబంధించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో గందరగోళం చోటుచేసుకుంది.

ఆ చిన్నారికి కరోనా నెగిటీవ్ వచ్చిందని ఇంటికి పంపించారు. మళ్లీ ఆ చిన్నారికి కరోనా పాజిటీవ్ అంటూ ఆస్పత్రికి తీసుకురావాలని అధికారులు సూచించారు. దీంతో కంగుతిన్న కుటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రికి పంపేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో రాత్రి నుంచి అధికారులకు, చిన్నారి కుటుంబ సభ్యులకు వాగ్వాదం చోటుచేసుకుంది.

You might also like