FbTelugu

ఏపీ ఉద్యోగ సంఘాల్లో విభేదాలు

అమరావతి: ఏపీలో ఉద్యోగ సంఘాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఏపీ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డిపై అమరావతి ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వేంకటేశ్వర్లు మాట్లాడుతూ, అసలు వెంకట్రామిరెడ్డికి కిందిస్థాయి ఉద్యోగులతో సంబంధాలే లేవని, ఆయన వ్యవహార శైలిపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడుతో కలిసి బీజేపీ కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఉద్యోగ సంఘాల్లో ఉన్న లుకలుకలు వెలుగు చూస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.