FbTelugu

యువతి కోసం ఇరు వర్గాల ఘర్షణ

గుంటూరు: కోటప్పకొండ తిరునాళ్లలో తమ వర్గానికి చెందిన యువతితో మరో వర్గం యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఆరుగురుకి గాయాలు అవగా… వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
నరసరావుపేట మండలం పమిడిపాడులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

కోటప్పకొండ తిరునాళ్లలో ఒక వర్గానికి చెందిన యువతితో మరో వర్గం యువకుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ ఘర్షణ తలెత్తినట్లు సమాచారం. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు పమిడిపాడుకు చేరుకున్నారు. దాడిలో గాయపడిన క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.