FbTelugu

హనుమాన్ జంక్షన్ లో గొడవ

విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, టీడీపీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ వర్గీయులు హనుమాన్ జంక్షన్ లో పరస్పరం దాడులు చేసుకున్నారు.

శనివారం సాయంత్రం హనుమాన్ జంక్షన్ లో రెండు గ్రూపులు తలపడడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. భారీగా జనం మోహరించడంతో కలకత్తా – చెన్నై జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు వైపు నుంచి టీడీపీ ఎమ్మెల్యే  అబ్బయ్యచౌదరి, వంగవీటి రాధాకృష్ణ లు ఎవరి వాహనాల్లో వారు విజయవాడ వైపు వెళుతున్నారు. ఇరువురి వాహనాలు జంక్షన్ కూడలిని దాటిన తరువాత ముందుకు వెళ్లే క్రమంలో ఎమ్మెల్యే అనుచరులకు చెందిన వాహనాలు కొన్ని ముందుకు వెళ్లాయి. ఎమ్మెల్యే వాహనం మధ్యలో ఉండిపోవడంతో ఆయన అనుచరులు రాధా అనుచరులను ప్రక్కకు తప్పుకోవాలని కేకలు వేశారు.

ఈ క్రమంలో రాధా అనుచరులు కూడా గట్టిగా అరవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. రాధా అనుచరులు అబ్బాయ్య చౌదరి వర్గీయులపై దాడి చేశారు. ఇరువురి అనుచరులు జాతీయ రహదారిపై తమ వాహనాలను నిలిపివేసి పరస్పర దాడులకు సిద్ధమయ్యారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఒకరి తరువాత మరొకరిని అక్కడి నుంచి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.