FbTelugu

నో సెక్స్… నో కండోమ్.. ఎక్కడో తెలుసా?

టోక్యో: జపాన్ దేశ ప్రజలు ఒలింపిక్స్ నిర్వహణను వ్యతిరేకిస్తున్నా ముందుకు వెళ్లాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే ఈసారి క్రీడాకారులకు ఊహించని నిబంధన పెట్టింది. ప్రతి క్రీడాకారుడికి కండోమ్ లను ఇస్తాము కాని వాటిని వినియోగించవద్దని స్పష్టం చేసింది.

వాటిని తమ దేశాలకు తీసుకువెళ్లేందుకు అనుమతించామని తెలిపారు. 1988 లో సియోల్ జరిగిన ఒలింపిక్స్ నుంచి క్రీడాకారులకు కండోమ్స్ సరఫరా చేస్తున్నారు. కరోనా వైరస్ ముప్పు ఉన్నందున ఒలింపిక్స్ విలేజీలో భౌతిక దూరం అమలు చేస్తున్నామని, అందుకే క్రీడాకారులు సెక్స్లో పాల్గొనడానికి వీలులేదని పరోక్షంగా తెలిపింది. ఈ విషయాన్ని ఆటగాళ్లకు సూచించనున్నట్లు ఒలింపిక్స్ గేమ్స్ సిఈఒ తొషిరో ముటో తెలిపారు. ఆటగాళ్లకు భోజన సదుపాయం మొదలు ప్రతిది కరోనా నిబంధనలను అనుసరించి అందిస్తామని ఆయన తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.