FbTelugu

అంతర్రాష్ట్ర రాక పోకలపై షరతులు: డీజీపీ

అమరావతి: అంతర్రాష్ట్ర రాక పోకలపై షరతులు కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అంతర్రాష్ట్ర కదలిక లపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు ప్రస్తుత నిబంధనలు అమల్లో ఉంటాయని ఆయన అన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ కి రావాలనుకునే ప్రయాణీకులు స్పందన పోర్టల్ ద్వారా ఈ పాస్ తీసుకోవాలి అన్నారు. కరోన ప్రభావం తక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారెంటైన్ లో ఉండాల్సిందేనన్నారు. కరోన ప్రభావం ఎక్కువ గా ఉన్న రాష్ట్రాల నుంచి వొచ్చే వారు 7 రోజులు ఇన్ స్టిట్యూషనల్ క్వారెంటైన్ లో ఉండాల్సిందేనన్నారు.

కోవిడ్ టెస్ట్ ఖచ్చితంగా చేయించుకోవాలని, పాజిటివ్ వస్తే కోవిడ్ హాస్పిటల్ కు, నెగటివ్ వస్తే మరో ఏడు రోజులు  హోమ్ క్వారెంటైన్ లో ఉండాల్సి వస్తుందని డీజీపీ తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకు అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు కొనసాగుతాయని ఆయన అన్నారు. అంతర్రాష్ట్ర ఆంక్షలు కేంద్రం సడలించిన నేపథ్యంలో డీజీపీ వివరణ ఇచ్చారు

You might also like