FbTelugu

విశాఖ రాజధానికి 15న శంకుస్థాపన: ధర్మాన

శ్రీకాకుళం: విశాఖపట్నంలో రాజధాని పనులకు ఆగస్టు 15న శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు.

వికేంద్రీకరణతో రాష్ట్రంలో మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన మీడియాతో అన్నారు. విశాఖ అభివృద్ధి చెందేందుకు సహజసిద్ధంగా అనేక వనరులు ఉన్నాయని, ఈ విషయంలో టీడీపీ ఆరోపణలు సహేతుకం కాదని మంత్రి ధర్మాన స్పష్టం చేశారు. ఆర్థిక రాజధానిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ధర్మాన తెలిపారు. సీఎం నిర్ణయంపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.

You might also like