FbTelugu

గాంధీ ఆసుపత్రి ముందు జూడాల ఆందోళన

హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతున్నది. అడ్మినిస్ట్రేషన్ తప్పులకు డాక్టర్ల పై దాడులు జరుగుతున్నాయని, ఇదెక్కడి న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు.

భద్రత కల్పించడంలో విఫలమైనందుకు నిరసనగా ఇవాళ గాంధీ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై జూనియర్ డాక్టర్లు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ప్రధాన గేటు మూసివేసే ప్రయత్నం చేసినప్పటికీ తోసుకుని రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

మంగళవారం నాడు గాంధీ ఆసుపత్రిలో బేగంపేట గురుమూర్తి నగర్ ప్రాంతానికి చెందిన  కరోన బాధితుడు (48) మృతి చెందాడు. అంత్యక్రియల నిమిత్తం బేగంపేటకు చెందిన వ్యక్తి మృతదేహానికి బదులు మరో వ్యక్తి మృతదేహాన్నిస్మశానవాటిక కు తరలించారు. మృతదేహం తమది కాదని కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

స్మశాన వాటిక వద్ద కుటుంబ సభ్యులకు వైద్య సిబ్బందికి స్వల్ప ఘర్షణ జరిగింది. ఆ తరువాత గాంధీ ఆసుపత్రి చేరుకుని వైద్యులపై దాడులకు దిగారు. దీన్ని నిరసిస్తూ నిన్నటి నుంచి జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.