న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 17వ రోజుకు చేరింది. ఇవాళ రైతులు రహదారుల దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వంతో పలుమార్లు జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రైతులు నిర్ణయించారు.
నేడు ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధించనున్నారు. రైతుల హెచ్చరిక నేపథ్యంలో టోల్గేట్ల వద్ద, ఢిల్లీ శివారులోనూ ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను మోహరించింది. రైతుల ఆందోళనకు దేశంలోని అనేక రాజకీయ పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.