FbTelugu

2021లో పోలవరం పూర్తి: మంత్రి అనిల్

Completing-Polavaram-in-2021-says-Minister-Anil

తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ తెలిపారు. 2021 జూన్ లోపు పోలవరం పూర్తి చేయగలమని అధికారులు అంచనా వేశారని వివరించారు. తాడేపల్లిలో మంత్రి అనిల్ మీడియాతో మాట్లాడుతూ, పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్ట్ లు నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పునరావాసం పనులు నిర్లక్ష్యం చేసింది, అందుకే ఆలస్యమవుతున్నాయి. అన్ని ప్రాజెక్టుల పనులు, పునరావాసం నియమిత సమయంలో పూర్తి చేస్తామని, అందుకోసం కార్యాచరణ కూడా రూపొందించామన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆహ్వానించదగిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్నో అడ్డంకులు సృష్టించాయన్నారు.

పోలవరం పనులు ఈ రోజు ప్రారంభం అయ్యాయమని, అబద్దాలు, మోసం చేసి ప్రజలను మభ్యపెట్టే అలవాటు మాకు లేదన్నారు. ప్రతిపక్షoతో పాటు మరో రెండు పార్టీలు ఎదో హడావుడి చేస్తున్నాయన్నారు. సీఎం జగన్ నిర్ణయంతో రివర్స్ టెండర్ ద్వారా రూ.800 కోట్లు ఆదా చేసి చూపించామన్నారు. ఏ పనులు పూర్తి చేయకుండా 70 శాతం చేశామని ప్రకటించి చంద్రబాబు మోసం చేశారు. మూడేళ్లపాటు నిద్రపోయారు.. చివరి రెండేళ్లలో స్పిల్ వే కట్టి అంతా చేసేసామని గొప్పలు చెప్పారని మంత్రి అనిల్ అన్నారు.

You might also like