FbTelugu

రెండు సార్లు కరోనా సర్వే పూర్తి

అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో 1.32 కోట్ల కుటుంబాలను రెండుసార్లు సర్వే చేశామని ఏపీ వైద్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రకటించారు.

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి వైద్య, ఆరోగ్య శాఖ నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని వైద్య శాఖ ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  ఇప్పటి వరకు 1.32 కోట్ల కుటుంబాలను ఆరోగ్యపరంగా రెండు సార్లు సర్వే చేశామన్నారు. సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మూడో విడత సర్వే కూడా కొనసాగుతోందన్నారు. మూడో విడత సర్వేలో 1.46 కోట్ల కుటుంబాల వివరాలు సేకరిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు  12, 311 మంది అనుమానితులను గుర్తించామని, వారందరూ క్వారంటైన్ లో ఉన్నారన్నారు. రెండు విడతల్లో జరిగిన సర్వేలో వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారని భాస్కర్ తెలిపారు.

You might also like